Sushant Singh : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్.. రియా చక్రవర్తికి క్లీన్ చిట్..!

Sushant Singh : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ క్లోజర్ రిపోర్టును ముంబై కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం, రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదని పేర్కొంది.

Sushant Singh Rajput death case

Sushant Singh : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై కోర్టులో ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. ఈ నివేదికలో రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ పేర్కొన్నట్టుగా సమాచారం.

Read Also : MSSC vs SSY : మహిళల కోసం అద్భుతమైన గవర్నెమెంట్ స్కీమ్స్.. ఏ పథకంలో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయో తెలుసా?

జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే, సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించి వార్తలు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని బాధితుడి కుటుంబం ఆరోపించింది. సుశాంత్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దాదాపు 4 ఏళ్లపాటు విచారణ కొనసాగింది. నటుడి మృతి కేసులో సీబీఐకి ఎలాంటి ముఖ్యమైన ఆధారాలు లభించలేదని, ఆ తర్వాత కేసును క్లోజ్ చేయాలని కోర్టును ఆశ్రయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రియా చక్రవర్తికి క్లీన్ చిట్.. :
నివేదికలు, సంబంధిత వర్గాల ప్రకారం.. సీబీఐ దర్యాప్తులో, నటుడి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలిసింది. సుశాంత్‌ను ఎవరైనా ఆత్మహత్యకు బలవంతం చేసినట్లు ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభించలేదని వర్గాలు తెలిపాయి.

Read Also : Realme P3 5G : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. భారీ బ్యాటరీ, అతి తక్కువ ధరకే రియల్‌మి P3 5G ఫోన్.. డోంట్ మిస్..!

ఇప్పుడు సుశాంత్ కుటుంబానికి ముంబై కోర్టులో నిరసన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ముంబైలోని ఒక ప్రత్యేక కోర్టులో సీబీఐ క్లోజర్ నివేదికను దాఖలు చేసిందని, ఆ నివేదికను అంగీకరించాలా లేక తదుపరి దర్యాప్తునకు ఆదేశిస్తుందా అనేది ఇప్పుడు కోర్టు నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు సీబీఐ క్లోజర్ రిపోర్టుపై కోర్టు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.