Realme P3 5G : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. భారీ బ్యాటరీ, అతి తక్కువ ధరకే రియల్‌మి P3 5G ఫోన్.. డోంట్ మిస్..!

Realme P3 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి P3 5G ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోండి. భారీ బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..

Realme P3 5G : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. భారీ బ్యాటరీ, అతి తక్కువ ధరకే రియల్‌మి P3 5G ఫోన్.. డోంట్ మిస్..!

Realme P3 5G Phone Massive Battery

Updated On : March 22, 2025 / 10:09 PM IST

Realme P3 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. రియల్‌మి P3 5G ఫోన్ అత్యంత సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాదు.. స్పీడ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, స్మూతనింగ్ డిస్ప్లేను కలిగి ఉంది. మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే.. ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, ధరతో పాటు బ్యాంకు ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Vivo Y39 5G : ఖతర్నాక్ ఫీచర్లతో వివో Y39 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

రియల్‌మి P3 5G ప్రాసెసర్ :
రియల్‌మి P3 5G ఫోన్ 2.3GHz వద్ద ఆక్టా-కోర్ కాన్ఫిగరేషన్‌తో కూడిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4 ప్రాసెసర్ కలిగి ఉంది. అత్యంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ కాకపోయినా, రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ 5జీ ఫోన్‌లో 6GB ర్యామ్ ఉంది.

అదనపు 6GB వర్చువల్ ర్యామ్ కూడా అందుబాటులో ఉంది. మల్టీ టాస్కింగ్ ఆప్షన్ కూడా ఉంది. యాప్‌లు వేగంగా ఓపెన్ అవుతాయి. అయితే, హై-ఎండ్ పర్ఫార్మెన్స్ అవసరమయ్యే గేమర్లకు ఈ చిప్‌సెట్ పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు.

డిస్‌ప్లే, బ్యాటరీ :
రియల్‌మి P3 5Gలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. స్క్రోలింగ్, గేమింగ్ విషయంలో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్‌లు, కలర్ ఆప్షన్లు స్పష్టంగా కనిపిస్తాయి. డిస్‌‌ప్లే 2000 నిట్స్ అద్భుతమైన గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

సూర్యకాంతిలో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, భారీ వినియోగంలో కూడా ఒక రోజు కన్నా ఎక్కువసేపు ఉంటుంది. 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఇందులో బ్యాక్ ఛార్జింగ్ ఆప్షన్ ఇతర ఫోన్‌ల ఉపయోగానికి పవర్ బ్యాంక్‌గా పనిచేస్తుంది.

రియల్‌మి P3 5G కెమెరా ఫీచర్లు :
రియల్‌మి ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డే టైమ్ ఆకర్షణీయమైన ఫొటోల కోసం అల్ట్రా-వైడ్-యాంగిల్ లేదా టెలిఫోటో లెన్స్ లేదు. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సోషల్ మీడియా షేరింగ్‌కు బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే, ఈ కేటగిరీలో బెస్ట్ ఫోన్ కాదనే చెప్పాలి.

రియల్‌మి P3 5G ధర ఎంతంటే? :
రియల్‌మే P3 5G అసలు ధర రూ. 19,999 ఉండగా, తగ్గింపు తర్వాత ఇప్పుడు ఈ 5జీ ఫోన్ ధర రూ.16,999కి అందుబాటులో ఉంది. భారీ బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్ అవసరయ్యే బడ్జెట్ 5G యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు :
అన్ని బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌దారులకు 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అన్ని బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ. 150 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Read Also : MSSC vs SSY : మహిళల కోసం అద్భుతమైన గవర్నెమెంట్ స్కీమ్స్.. ఏ పథకంలో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయో తెలుసా?

ఈ రియల్‌మి 5జీ ఫోన్ కొంటారా? :
భారీ బ్యాటరీతో సరసమైన 5G ఫోన్ కోసం చూసేవారికి రియల్‌మి P3 5G బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌లో అమోల్డ్ స్క్రీన్, తగినంత ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. కానీ, మీకు కెమెరా పర్ఫార్మెన్స్ లేదా హై-ఎండ్ గేమింగ్ ముఖ్యమైతే మరో ఫోన్ కోసం వేచి చూడాల్సిందే. ధర పరంగా చూస్తే ఈ 5G ఫోన్ ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.