2012 డిసెంబర్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం జైళ్లో ఉన్న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాబిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసింది. నిర్భయ కేసులో ఒకడు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమం కి తరలించి ఆ తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష విధించారు. ఐదుగురిలో ఒకరైన రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకునొ చనిపోగా జైళ్లో మిగిలిఉన్న నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం అప్లై చేసుకున్నాడు. హైదరాబాద్ లో దిశ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన సమయంలో కేంద్రప్రభుత్వం నిర్భయ కేసులో దోషికి క్షమాబిక్ష పెట్టవద్దంటూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్…క్షమాబిక్ష అభ్యర్ధనను తిరస్కరించే ఫైల్‌ను పంపిన రెండు రోజుల తరువాత ఇది జరిగింది. తుది నిర్ణయం కోసం ఫైల్ ను రాష్ట్రపతికి ఫార్వార్డ్ చేశామని,నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరి క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని సిఫారసు చేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఫైల్‌లో వ్యాఖ్యానించినట్లు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా కోవింద్ ముందు దాఖలైన నిర్భయ దోషి క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని గట్టిగా సిఫారసు చేసినట్లు సమాచారం.