ఆటోలో వెంబడించి చైన్ స్నాచింగ్ : బంగారు గొలుసు లాక్కుని పరార్

చైన్ స్నాచర్ లు మరోసారి రెచ్చిపోయారు. ఆటోలో వెంబడించి స్నాచింగ్ కు పాల్పడ్డారు. మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 06:16 AM IST
ఆటోలో వెంబడించి చైన్ స్నాచింగ్ : బంగారు గొలుసు లాక్కుని పరార్

Updated On : April 18, 2019 / 6:16 AM IST

చైన్ స్నాచర్ లు మరోసారి రెచ్చిపోయారు. ఆటోలో వెంబడించి స్నాచింగ్ కు పాల్పడ్డారు. మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చైన్ స్నాచర్ లు మరోసారి రెచ్చిపోయారు. ఆటోలో వెంబడించి స్నాచింగ్ కు పాల్పడ్డారు. మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… సరిత అనే మహిళ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17 బుధవారం సాయంత్రం సరిత వెస్ట్ మారేడ్ పల్లి గోకుల్ రెస్టారెంట్ సమీపంలో రోడ్డుపై నడిచి వెళ్తోంది. వెనుక నుంచి ఆటోలో వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు.

బాధితురాలి వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నారు. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్