కరోనా వైరస్ పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా రీసెర్చర్ దారుణ హత్య

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 06:29 AM IST
కరోనా వైరస్ పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా రీసెర్చర్ దారుణ హత్య

Updated On : May 7, 2020 / 6:29 AM IST

కరోనా వైరస్‌ పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనీస్ మెడికల్ రీసెర్చర్ అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని యూనివర్శిటీ ఆఫ్ పీటర్స్ బర్గ్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న బింగ్ లియు(37)… పిట్స్‌బర్గ్‌ కు ఉత్తరాన ఉన్న రాస్‌ టౌన్‌ షిప్‌ లోని తన నివాసంలో లియు శవమై కనిపించారు. లిము తల,మెడపై బుల్లెట్ గాయాలున్నట్లు గుర్తించినట్లు రాస్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. 

బింగ్ లియు స‌న్నిహితంగా ఉండే హోగూ(46) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా తన కారులో విగ‌త‌జీవిగా ప‌డి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లియూ ను అతడే కాల్చి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. లియూని ఆయన ఇంటికెళ్లి కాల్చి చంపి వచ్చిన తర్వాత కారులో కూర్చొని భార్యతో మాట్లాడిన తర్వాత హోగూ తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. లియు పరిశోధనలకు, ఈ హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కరోనా వైరస్‌ సోకినప్పుడు కణ స్థాయిలో చోటుచేసుకునే మార్పులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాల్లో కీలక ముందంజ వేసిన సమయంలో లియు హత్యకు గురవడం గమనార్హం. 

Also Read | సరైన నిద్ర లేకపోతే కరోనాను తట్టుకోలేం