Fake Currency Notes : ఏం తెలివి..! జస్ట్ నెయిల్ పాలిష్‌, కలర్ ప్రింటర్‌తో దొంగ నోట్ల ముద్రణ, పోలీసుల అదుపులో కేటుగాడు

Fake Currency : వ్యసనాలకు బానిసగా మారిన గోపాల్, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నాడు.

Chittoor Fake Notes : చిత్తూరు జిల్లా పలమనేరులో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న వ్యక్తి గుట్టును రట్టు చేశారు పోలీసులు. నేరస్తుడు గోపాల్ ను అరెస్ట్ చేసి అతడి నుంచి 8వేల 200 రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ తన ఇంట్లోనే దొంగ నోట్లను ప్రింట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వ్యసనాలకు బానిసగా మారిన గోపాల్, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నాడు. టీ కొట్టు నడుపుకునే గోపాల్ కలర్ ప్రింటర్ సాయంతో నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నాడు. కూరగాయల వ్యాపారుల ఫిర్యాదుతో పోలీసులు నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ త్రెడ్ కు నెయిల్ పాలిష్ పూసి ఆ నోట్లను మార్కెట్ లో మార్చేవాడని పోలీసులు గుర్తించారు.

Also Read..Radha Death Case: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసును చేధించిన పోలీసులు.. కట్టుకున్న వాడే కడతేర్చినట్లు నిర్ధారణ

టెక్నాలజీ డెవలప్ అయినందుకు సంతోషించాలో, బాధపడాలో తెలియని పరిస్థితి ఉంది. టెక్నాలజీని మంచి పనుల కోసం ఉపయోగిస్తే తప్పు లేదు. కానీ, అదే సాంకేతికతను తప్పుడు పనులకు వాడితే, దుర్వినియోగం చేస్తే చాలా ప్రమాదం. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు దర్శనం ఇస్తాయి. వాటిని చూసి అనేక కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు.

ఇది సంతోషించాల్సిన విషయమే. కానీ, అదే సమయంలో.. కొందరు కేటుగాళ్లు, క్రిమినల్స్ యూట్యూబ్ ని దుర్వినియోగం చేస్తున్నారు. అందులోని వీడియోలను చూసి తప్పుడు పనులు చేస్తున్నారు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ సమస్య ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. చాలామంది యూట్యూబ్ లో చూసి ఎంతో ఈజీగా దొంగ నోట్లు ప్రింటింగ్ చేసేస్తున్నారు.

Also Read..Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

ఉన్నత చదువులు చదువుకున్న వారే కాదు అస్సలు చదువు రాని వారు కూడా యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు ముద్రించేస్తున్నారు. జస్ట్ ఓ కలర్ ప్రింటర్, కొన్ని రకాల కలర్స్ తో ఇట్టే నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. టెక్నాలజీని తప్పుడు పనులకు వాడుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు