ముక్కలు ముక్కలు చేసి : సినీ నటి హత్య
తెలంగాణలో టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య ఘటన ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ ఘోరం మరువక ముందే చెన్నైలో మరో దారుణం వెలుగు చూసింది. సినీ సహాయ

తెలంగాణలో టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య ఘటన ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ ఘోరం మరువక ముందే చెన్నైలో మరో దారుణం వెలుగు చూసింది. సినీ సహాయ
చెన్నై: తెలంగాణలో టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య ఘటన ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ ఘోరం మరువక ముందే చెన్నైలో మరో దారుణం వెలుగు చూసింది. సినీ సహాయ నటి దారుణ హత్యకు గురైంది. ఆమె భర్తే హంతకుడు. భార్యను చంపిన భర్త.. డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా కోసి పలుచోట్ల పడేయడం సంచలనం రేపింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని వ్యక్తికి చెందిన రెండు కాళ్లు, ఒక చేయిని 2019 జనవరి 21వ తేదీన పోలీసులు గుర్తించారు. చేతులకు గాజులు ఉండటంతో మృతదేహం మహిళదిగా నిర్దారించారు. చేతుల మీద డ్రాగన్, శివపార్వతుల టాటూలు కనుగొన్నారు. వాటి ఆధారంగా మృతురాలి ఆచూకీ కోసం అనేక చోట్ల తీవ్రంగా వెతికారు. చివరకు చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సినీ సహాయ నటి సంధ్య (38)గా గుర్తించారు.
సంధ్య సినిమాల్లో సహాయ నటిగా చేస్తుంది. ఆమె భర్త బాలకృష్ణన్ కూడా సినీ దర్శకుడే. భార్య వివాహేతర సంబంధం పెట్టుకునేందనే అనుమానంతో అతడు మృగాడిలా మారాడు. ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి వేర్వేరు చోట్ల పడేశాడు. భార్యను చంపిన భర్త తనకు ఏమీ తెలియదన్నట్టు యాక్ట్ చేశాడు. తన భార్య అదృశ్యం అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో వారికి గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ భాగాలు లభించాయి. ఎక్కడో వారికి డౌట్ వచ్చింది. బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించారు. దీంతో అతడు నిజం బయటపెట్టాడు.
అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌ను 2019, ఫిబ్రవరి మంగళవారం 5వ తేదీ రాత్రి అదుపులోకి తీసుకుని కేసును ఛేధించారు. భార్య, భర్తలిద్దరూ సినీపరిశ్రమకు చెందిన వారే. సంధ్య కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు భర్త అనుమానించాడు. రాత్రివేళల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు సంధ్య పాల్పడుతుండటంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో ప్రియునితోనే ఉంటానని సంధ్య తేల్చిచెప్పింది. ఇదే విషయమై జనవరి 20న దంపతులు ఘర్షణ పడ్డారు. అప్పటికే మర్డర్ స్కెచ్ వేసుకున్న బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపాడు. రాత్రి 10గంటలకు ఆమెను చంపాడు. ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేశాడు. జనవరి 21వ తేదీ తెల్లవారుజామున 5గంటల సమయంలో మృతదేహం భాగాలను పలుచోట్ల పారేశాడు. పోలీసులు 2 వారాల పాటు శ్రమించి మిస్టరీని చేధించారు. నిందితుడిని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం అరెస్ట్ చేశారు. భార్యను చంపడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు చేసిన తీరు తమిళనాడులో సంచలనం రేపింది. తమిళ సినీ పరిశ్రమ వర్గాలను షాక్‌కు గురి చేసింది.