అగ్రిగోల్డ్ ఆస్తులను కనిపెట్టిన సీఐడీ
అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ కనిపెట్టింది. బినామీల పేరుతో ఉన్న 151 స్థిరాస్తులను గుర్తించింది.

అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ కనిపెట్టింది. బినామీల పేరుతో ఉన్న 151 స్థిరాస్తులను గుర్తించింది.
విజయవాడ : అగ్రిగోల్డ్ కేసును సీఐడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ కనిపెట్టింది. బినామీల పేరుతో ఉన్న 151 స్థిరాస్తులను గుర్తించింది. గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లలో 33 ఆస్తులు జప్తు చేసింది. అమరావతి పరిధిలో 600 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించింది. ఏపీలోని 6 జిల్లాల్లో 118 ఆస్తుల జప్తుకు సిద్ధం అయింది. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆస్తుల గుర్తించారు. హాయ్‌లాండ్‌తో పాటు కర్నాటక, తమిళనాడులో భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది.
అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన మోసాలపై మొత్తం 29 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఏపీలో 15 కేసులు, తెలంగాణాలో 3, కర్ణాటకలో 9, అండమాన్ నికోబర్, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి. మొత్తం 19,18,865 డిపాజిటర్ల (32,02,632ఖాతాలు)లో ఏపీకి చెందిన 11,57,497 మంది(19,43,121ఖాతాలు) ఉన్నారు. మొత్తం రూ.6,380 కోట్ల 31 లక్షల డిపాజిట్లలో ఏపీకి చెందిన రూ.3,944 కోట్ల 70 లక్షల డిపాజిట్లు ఉన్నాయి.