Students Clash : పదవ తరగతి విద్యార్ధుల మధ్య ఘర్షణ-ఒకరి మృతి

హైదరాబాద్ కృష్ణా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్ధి మృతి చెందాడు.

Students Clash : హైదరాబాద్ కృష్ణా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్ధి మృతి చెందాడు.

స్ధానిక సాయికృప  పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల మధ్య వివాదం జరిగి ఘర్షణ పడ్డారు. తరగతి గదిలో పేపర్‌ బాల్ తో క్రికెట్‌ ఆడుతూ ఉండగా నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మన్సూర్‌ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : Love Affair : ఫోన్ కాల్ తెచ్చిన తంటా… అనుమానంతో ప్రియురాలు హత్య
వెంటనే పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే  విద్యార్ధి  మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటనా స్ధలానికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు