Security Guard Murder : జీతం అడిగాడని వృధ్ధుడిపై పెట్రోల్ పోసి తగల బెట్టిన యజమానులు
తనకు రావాల్సిన జీతం అడిగినందుకు ఓ సెక్యూరిటీ సంస్ధ నిర్వాహకులు వృధ్ధుడిని పెట్రోల్ పోసి తగలబెట్టి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. గత కొద్ది నెలలుగా తనకు రావాల్సిన జీతం అడిగినందుకు వ

Coimbatore Murder
Security Guard Murder : తనకు రావాల్సిన జీతం అడిగినందుకు ఓ సెక్యూరిటీ సంస్ధ నిర్వాహకులు వృధ్ధుడిని పెట్రోల్ పోసి తగలబెట్టి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. గత కొద్ది నెలలుగా తనకు రావాల్సిన జీతం అడిగినందుకు వారు ఈ దారుణానికి ఒడిగట్టారు.
మధురైకి చెందిన రత్నవేల్ (76) నాలుగేళ్ల క్రితం కోయంబత్తూరు, రామనాధపురం వెళ్లి అక్కడ ఒక సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీలో పనికి చేరాడు. వారు చెప్పిన చోట సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇటీవల గత నాలుగు నెలలుగా సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు దిలీప్ కుమార్, జాన్ లు రత్నవేల్ కు జీతం సరిగా ఇవ్వటంలేదు.
తనకు జీతం కావాలని రత్నవేల్ తన యజమానులపై ఒత్తిడి తీసుకు రాసాగాడు. దీంతో వారు జీతం ఇస్తాం రమ్మనమని గురువారం కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడకు వచ్చిన తర్వాత కుమార్, జాన్ లకు రత్నవేల్ తో గొడవ జరిగింది. అనంతరం కొడిస్సియా ఏటీఎం సెంటర్ దగ్గర ఉండమని అక్కడ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. రత్నవేల్ వారు చెప్పిన చోటకు వెళ్లి ఎదురు చూడసాగాడు.
కొద్దిసేపటికి కుమార్, జాన్ ఇద్దరూ అక్కడకు వచ్చి ఏటీఎం సెంటర్ నుంచి డబ్బు డ్రా చేసి రత్నవేల్ వద్దకు వచ్చారు. అక్కడ అతడిని హేళనగా మాట్లాడుతూ అతనిపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న పెట్రోల్ అతనిపై పోసి నిప్పంటించి పరారయ్యారు. మంటల్లో కాలుతూ వృధ్దుడుపెట్టిన కేకల్నివిన్నస్ధానికులు అతడి మంటలు ఆర్పి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read : Dombivli Murder Case : వీడిన సుప్రియ ఆంటీ మర్డర్ మిస్టరీ
పీలమేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడి వాంగ్మూలం తీసుకున్నారు. పరారీలో ఉన్ననిందితులకోసంగాలింపు చేపట్టారు. కాగా…. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరత్నవేల్ శుక్రవారం రాత్రి మరణించాడు. మొదట పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) సహా నేరాలకు సంబంధించి కేసు నమోదు చేశారు. రత్నవేల్ కాలిన గాయాలతో మరణించడంతో, పోలీసులు నేరాన్ని IPC 302 (హత్యకు శిక్ష)కి మార్చినట్లు పోలీసులు తెలిపారు.