అదృశ్యమైన మైనర్ బాలికల కేసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు 

  • Publish Date - May 3, 2019 / 03:22 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను తిరిగి విచారణ చేపట్టాలని  కోరూతూ హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ శుక్రవారం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 2వేల మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు నమోదై ఉంటాయని, వాటిని తిరిగి విచారణ జరిపించాలని ఆయన కోరారు.  

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ లో జరిగినట్లు గానే కనపడుకుండా పోయిన మైనర్ బాలికలపై అఘాయిత్యాలు  జరిగి ఉంటాయని ఆయన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.