Constable Alcohol : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు. 

Shamshabad

Constable Alcohol : శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.  గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనం పక్కకు తీయాలని అడిగిన వారిపై శివాలెత్తాడు. నోటికొచ్చినట్లు తిడుతూ రెచ్చిపోయాడు.

మద్యం మత్తులో ప్రయాణికులపై చిందులు వేశారు. కానిస్టేబుల్ తో విసిగి పోయిన ప్రయాణికులు 100కి కాల్ చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుల్ జి.రాజమల్లయ్యగా గుర్తించారు.