Youtber Jyoti Malhotra: నన్ను పెళ్లి చేసుకో.. పాకిస్తాన్ ISI ఏజెంట్‌తో యూట్యూబర్ చాటింగ్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న జ్యోతి లీలలు..

మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం పని చేస్తున్న దేశద్రోహులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాకిస్తాన్ కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై..

Youtber Jyoti Malhotra: పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (ట్రావెల్ వ్లాగర్) కేసు విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తో ఆమె వాట్సాప్ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను పెళ్లి చేసుకోవాలని పాక్ ఏజెంట్ ను ఆమె కోరినట్లు వాట్సాప్ చాటింగ్ లీక్ అయ్యింది. వారిద్దరి మధ్య కోడ్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు.

హర్యానా హిసార్ లో నివాసం ఉండే జ్యోతి మల్హోత్రా.. ట్రావెల్ విత్ జో(Travel With Jo) పేరుతో యూట్యూబ్ చానల్ రన్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఏర్పరచుకుంది. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తో ఆమె నిత్యం కాంటాక్ట్ లో ఉన్నట్లు విచారణలో బయటపడింది. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ గా అలీ హసన్ పని చేస్తున్నాడు.

అలీ హసన్, జ్యోతి మల్హోత్రా తరుచుగా, చాలాసేపు మాట్లాడుకునే వారని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక షాకింగ్ చాట్ ఉంది. నన్ను పెళ్లి చేసుకోండి అని జ్యోతి మల్హోత్రా అలీ హసన్ ని కోరింది. తనను పాకిస్తాన్ లో వివాహం చేసుకోవాలని, ఇస్లామాబాద్ ను వదిలి ఉండలేకపోతున్నట్లు జ్యోతి అతడితో చెప్పింది. వారిద్దరి మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనం అంటున్నారు విచారణ అధికారులు.

వాట్సాప్ చాట్ ద్వారా విచారణ అధికారులు కీలక విషయాలు తెలుసుకున్నారు. వారిద్దరి మధ్య కోడ్ సంభాషణలు జరిగాయి. అందులో భారత్ అండర్ కవర్ ఆపరేషన్స్ గురించి చర్చించారు. దర్యాఫ్తులో భాగంగా పోలీసులు జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాలపై ఫోకస్ పెట్టారు. ఆమెకు 4 బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయి. దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అయినట్లు గుర్తించారు. దీంతో అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఆమెకు ఎవరి నుంచి డబ్బు అందిందో ఆరా తీస్తున్నారు.

Also Read: పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం.. హోం మంత్రి ఇంటికి నిప్పు.. జనంపై కాల్పులు.. రచ్చ రచ్చ

జ్యోతి మల్హోత్రా ఇన్ స్టా అకౌంట్ కు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె రెండుసార్లు పాకిస్తాన్ లో పర్యటించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి రహీమ్ పరిచయం ఏర్పడింది. ఈ తర్వాతే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ను జ్యోతికి పరిచయం చేశాడు రహీమ్. పాకిస్తాన్ నుంచి తిరిగి భారత్ కు వచ్చిన తర్వాత జ్యోతి పాకిస్తాన్ హ్యాండలర్స్ తో టచ్ లో ఉంది.

భారత్ ఆర్మీకి సంబంధించిన కీలక, సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ హ్యాండలర్స్ కు జ్యోతి చేరవేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు షూట్ చేసేందుకే తన కూతురు పాకిస్తాన్ వెళ్లిందని జ్యోతి మల్హోత్రా తండ్రి చెప్పారు. ఆ తర్వాత ఆయన మాట మార్చారు. నేను పాకిస్తాన్ వెళ్లడం లేదు ఢిల్లీకి వెళ్తున్నా అని తనతో చెప్పిందన్నాడు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ లోని ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెంచారు. మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం పని చేస్తున్న దేశద్రోహులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాకిస్తాన్ కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విద్యార్థి, సెక్యూరిటీ గార్డ్, బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు.