Hyderabad Ganja Seized From Rowdy Sheeter
Ganja Seized : గంజాయి వినియోగం, రవాణా,అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ లో రౌడీషీటర్ మన్మోహన్ సింగ్(45)ను మంగళ్‌హాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడి వద్దనుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్, కల్తీ మద్యం విక్రయించడం, హత్యా కేసుల్లో మన్మోహన్ సింగ్ నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
2002 నుంచి మన్మోహన్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ సరఫరా కేసులో మన్మోహన్ సింగ్.. నాలుగు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆదివారం నుంచే తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.
Also Read : Rains In Andhra Pradesh : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు
సూర్యాపేటలో 2 కిలోల గంజాయిని రూ. 8 వేలకు కొనుగోలు చేసి, హైదరాబాద్ తీసుకువచ్చి చిన్న చిన్న పాకెట్లు లాగా కట్టి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.సింగ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.