Rains In Andhra Pradesh : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.

Rains In Andhra Pradesh : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు

Rains In Andhra Pradesh

Rains In Andhra Pradesh :  ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఇది పశ్ఛిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి గురువారం తెల్లవారు ఝూముకు ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read : AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..
చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.

రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వర్షాలు కురిసే సమయంలో దక్షిణ కోస్తా- తమిళనాడులో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.