Ganja Traders Arrested :జగిత్యాలలో గంజాయి విక్రేతలు అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం  హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ పార్టీలు ఒకరిమీద మరోకరు  విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.

Ganja Traders Arrested : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం  హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ పార్టీలు ఒకరిమీద మరోకరు  విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.  తెలంగాణలో  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు మత్తు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.    గంజాయి సాగు, విక్రేతలను ఏరిపారేస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారులు, గంజాయి ఉత్పత్తి దారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

తాజాగా జగిత్యాలలో గంజాయి విజ్రాయిస్తున్న ఇద్దరు యువకులను జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల కు చెందిన ఆరు ముళ్ళ సాయికుమార్ తోపాటు…గంజాయి సాగు చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ కు చెందిన మాడారి చందును పోలీసులు అరెస్టు  చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Illicit Affair : అతనికి 20, ఆమెకు 25 ఏళ్లు, విహాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను….

చందు అనే యువకుడు గంజాయి విక్రయించడంతో పాటు పలు దొంగతనాలకు పాల్పడుతున్న ట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని వద్ద నుంచి మూడు బైక్ ల ను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు.

మరో వైపు   ఇతర రాష్ట్రాల  నుంచి దిగుమతి అవుతున్న గంజాయిని కట్టడి చేసేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్‌, పాత నేరస్తుల వివరాలు సేకరిస్తూనే గంజాయి అమ్మకం, సరఫరా, వాడుతున్న వారిపై నిఘా పెట్టారు. రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఓలా, క్యాబ్‌ డ్రైవర్లపై దృష్టి సారిస్తున్నారు.  పోలీసు స్టేషన్ల వారీగా ప్రత్యేక నిఘా  బృందాలు ఏర్పాటు చేసి.. మత్తు వినియోగ దారులతో సహా అందరి  దుమ్ము దులుపుతున్నారు.

రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేకుండా  చేసే క్రమంలో ,  అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల  ముఖ్యమంత్రి కేసీఆర్  పోలీసులకు దిశా నిర్దేశం చేయడంతో పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తున్నారు. గంజాయి అమ్మేవారు, సరఫరా చేస్తున్నవారు, వాడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు.

కొందరు గుట్కా, సిగరెట్లలోనూ గంజాయి ఉపయోగిస్తున్నట్లు  సమచారం తెలియటంతో  అలాంటి వారి ఆట కట్టిస్తున్నారు. గతంలో ‘గుడుంబా’ వ్యాపారం చేసి   ఇప్పుడు గంజాయి  వ్యాపారంలోకి  అడుగుపెట్టిన వారి భరతం పడుతున్నారు. పలు  చోట్ల దాడులు నిర్వహించి.. భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు

ట్రెండింగ్ వార్తలు