prostitution activity
Prostitution Activity : హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో స్పా పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాన్ని పోలీసులు సీజ్ చేశారు. మాదాపూర్ అరుణోదయ కాలనీలోని ప్రభావతి ప్లాజా నాల్గవ అంతస్తులో నిర్వ్యవహిస్తున్న స్పాలో వ్యభిచారం నిర్వహిస్తూండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్పా పై దాడి చేసిన పోలీసులు బాధిత మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.