Heroin Seized Delhi Air port
Heroin Seized : పోలీసులు ఇతర అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేటుగాళ్లు వారి కళ్లు గప్పి మాదక ద్రవ్యాలు, బంగారం స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ దొరికింది.
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి భారత్ తీసుకు వచ్చిన హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయంలో జరిగే తనిఖీల్లో భాగంగా షార్జా మీదుగా ఎంటెబ్బే నుంచి వచ్చిన ఉగాండా ప్రయాణికురాలిని తనిఖీ చేయగా ఆమె వద్ద 1,060 గ్రాముల హెరాయిన్ లభించింది.
Also Read : Vaikunta Ekadasi 2022 : తిరుమలలో రేపు వైకుంఠ ఏకాదశి
దీంతో కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు . రూ. 7.43 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. హెరాయిన్ ను 107 క్యాప్సుల్స్ లో నింపి వాటిని సూట్ కేసులో దుస్తుల మధ్య ఉంచి స్మగ్లింగ్ చేయటానికి ప్రయత్నించింది నిందితురాలు.
నిందితురాలిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెరాయిన్ దేశంలో ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.