హైదరాబాద్ లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు…ఆన్ లైన్ ద్వారా రూ.14 లక్షలు విత్ డ్రా

  • Publish Date - July 22, 2020 / 10:33 PM IST

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల వేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్ క్రెడెట్ కార్డ్ ఉద్యోగుల పేరిట ఫోన్ చేసిన కేటుగాళ్లు 14 లక్షలకు టోకరా ఇచ్చారు. కేవైసీ అప్ డేట్ చేస్తామని చెప్పి తార్నాకకు చెందిన ఓ మహిళ నుంచి 7 లక్షలు కాజేశారు. మరో మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు 7 లక్షలు కాజేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్ లో గడిచిన మూడు రోజుల్లో సైబర్ నేరగాళ్లు సామాన్య, అమాయక ప్రజల నుంచి దాదాపు 34 లక్షల రూపాయలు కాజేశారు. వీరంతా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రధానంగా పర్సనల్ లోన్ తోపాటుగా ఇటు కేవైసీ, ఓఎల్ ఎక్స్ క్రెడిట్ కార్డులు, ఉద్యోగాల పేరుతో అమాయక ప్రజల నుంచి ఆన్ లైన్ ద్వారా సైబర్ క్రైమ్ నేరగాళ్లు అమౌంట్ అంతా కూడా డ్రా చేసుకుంటున్నారు. మూడు రోజులుగా గమనించినట్లైతే మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాంటూ హైదరాబాద్ సీసీఎల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

వీరిలో రిటైర్డ్ ఆర్మీ అధికారులతోపాటు గృహిణలు, మహిళలు ఉన్నారు. మూడు రోజుల్లో 34 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇవాళ మాత్రం 14 లక్షల రూపాయలు ఆన్ లైన్ ద్వారా డ్రా చేసుకున్నారు. సం చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు.