మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతుంది. వెంటనే అప్ గ్రేడ్ చేసుకోండి. లేదంటే.. మీ అకౌంట్లో నగదు ఫ్రీజ్ అయిపోతుంది.. అంటూ ఫోన్ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు కావొచ్చు.
మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతుంది. వెంటనే అప్ గ్రేడ్ చేసుకోండి. లేదంటే.. మీ అకౌంట్లో నగదు ఫ్రీజ్ అయిపోతుంది.. అంటూ ఫోన్ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు కావొచ్చు. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన మీ అకౌంట్లో డబ్బులు క్షణాల్లో కాజేస్తారు.. బ్యాంకు అధికారులమని కలరింగ్ ఇస్తారు. అకౌంట్ వివరాలు చెప్పమని అడుగుతారు. ఓటీపీ, బ్యాంకు వివరాలు చెప్పారంటే మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నగదు కాజేస్తారు.
ఈ కేటుగాళ్లు.. సామాన్యులనే కాదు.. ఏకంగా పోలీసు ఫ్యామిలీని కూడా బురిడీ కొట్టించిన ఘటన చెన్నైలో వెలుగు చూసింది. హెడ్ కానిస్టేబుల్ అకౌంట్ లో నుంచి రూ.10వేలు కాజేశారు. చెన్నైకి చెందిన ముత్తు క్రిష్ణవేణి అనే మహిళ విల్లివక్కం పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్త్తోంది. కొన్నిరోజుల క్రితం బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నమంటూ కేటుగాళ్లు క్రిష్ణవేణి భర్తకు ఫోన్ చేశారు. మీ భార్య క్రిష్ణవేణి బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతుందని నమ్మబలికారు.
ఆమె బ్యాంకు అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డు వివరాలు చెప్పాలని అడిగారు. బ్యాంకు కొత్త స్కీమ్ కింద అకౌంట్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని, అందుకు వివరాలన్నీ చెప్పాలన్నారు. 24 గంటల్లోపు వివరాలు అప్ డేట్ చేసుకోకపోతే.. మీ భార్య అకౌంట్ క్లోజ్ అవుతుందని నమ్మబలికారు. అది నమ్మిన క్రిష్ణవేణి భర్త.. ఆమె బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పాడు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన మెసేజ్ ఓటీపీని చెప్పమన్నారు.
వారు అడిగినట్టుగానే ఓటీపీ పాస్ వర్డ్ చెప్పేశాడు. అంతే.. మరుసటి రోజు క్రిష్ణవేణి అకౌంట్ నుంచి రూ.10వేలు నెట్ బ్యాకింగ్ ద్వారా విత్ డ్రా చేసినట్టుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. పది వేలు ఎవరూ విత్ డ్రా చేశారంటూ తన భర్తను అడిగింది. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చిన విషయాన్ని చెప్పాడు. వెంటనే.. క్రిష్ణవేణి తన అకౌంట్ డెబిట్ కార్డును బ్లాక్ చేయించి బ్యాంకు అధికారులకు కంప్లయిట్ చేసింది.
గమనిక : ఏ బ్యాంకు కూడా తమ కస్టమర్ల వ్యక్తిగత వివరాలు (డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అకౌంట్) చెప్పమని ఫోన్ చేసి అడగరు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.