కొడుకుని కొట్టిన తండ్రి : అరెస్ట్ చేసిన పోలీసులు

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 06:17 AM IST
కొడుకుని కొట్టిన తండ్రి : అరెస్ట్ చేసిన పోలీసులు

Updated On : March 30, 2019 / 6:17 AM IST

కేరళలో దారుణం చోటు చేసుకుంది. తండ్రే కసాయి వాడిలా వ్యవహరించాడు. కొడుకుని దారుణంగా కొట్టాడు. అతడి దాడిలో కొడుకు పుర్రె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.  అంతర్గత రక్తస్రావం జరిగింది. ఏడేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకులతో పోరాడుతున్నాడు. తండ్రి కొట్టిన విషయాన్ని బాధిత బాలుడి తమ్ముడు పోలీసులకు తెలిపాడు. దీంతో ఈ దారుణం  వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కసాయి తండ్రి అరుణ్ ఆనంద్ ని అరెస్ట్ చేశారు. అరుణ్ ఆనంద్ తరుచుగా పిల్లలను కొట్టేవాడని పోలీసుల విచారణలో తేలింది.

అరుణ్ ఆనంద్ ని కాపాడేందుకు పిల్లాడి తల్లి అబద్దాలు చెప్పింది. యాక్సిడెంట్ లో తన బాబుకి గాయాలు అయ్యాయని ఆస్పత్రి సిబ్బందికి చెప్పింది. ఆ గాయాలు తీరు చూసి ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది.  వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. పిల్లల సంరక్షణ కమిషన్ అధికారులను వెంటబెట్టుకుని వచ్చారు. వారి విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. అసలు అతడు తండ్రే కాదని తేలింది. సహజీవనం చేస్తున్నట్టు గుర్తించారు. పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టింది కూడా అతడే అని తేలింది. ఈ నిజాలన్నీ బాధిత బాలుడి తమ్ముడు బయటపెట్టాడు. అరుణ్ ఆనంద్… అన్నను తీవ్రంగా కొట్టాడని ఆ నాలుగేళ్ల బాలుడు చెప్పాడు. తన అన్నను పప్పి అని పిలుస్తాడు. పప్పి కాళ్లు, తలపై కొట్టాడని, కాళ్లు పట్టుకుని ఈడ్చేశాడని చెప్పాడు.

4 ఏళ్ల బాలుడి స్టేట్ మెంట్ మేరకు పోలీసులకు అంతా అర్థమైంది. పిల్లాడు అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టి ఆ నీచుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ 303(మర్డర్ అటెంప్ట్), జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతడికి నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు. మర్డర్ కేసులో హస్తం ఉన్నట్టు చెప్పారు. అరుణ్ తో పాటు పిల్లలను పట్టించుకోని తల్లిని కూడా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.