×
Ad

Pendurthi Incident: వామ్మో.. దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను చంపేసింది.. కోడలు ఖతర్నాక్ స్కెచ్.. ఫోన్ లో షాకింగ్ విషయం..

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్ వెలుగుచూసింది.

Pendurthi Incident: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. అత్తను చంపేందుకు కోడలు ఖతర్నాక్ స్కెచ్ వేసింది. పిల్లలు సరదాగా ఆడుకునే ఆటను తనకు అనుకూలంగా వాడుకుంది. దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను లేపేసింది.

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్ వెలుగుచూసింది. అత్త కనక మహాలక్ష్మిని కోడలు లలిత హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను తాళ్లతో బంధించి హత్య చేసింది కోడలు. ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు. కానీ, కథ అడ్డం తిరిగింది. పోలీసులు విచారణలో కోడలి బండారం బట్టబయలైంది.

”అత్త, కోడలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అత్తపై పగ పెంచుకున్న కోడలు.. ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యింది. దొంగ-పోలీస్ ఆట ఆడుదామని చెప్పింది. అత్త కళ్లకు గంతలు కట్టింది. కాళ్లు, చేతులు కూడా కట్టేసింది. ఆపై అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలు అంటుకుని అత్త చనిపోయింది. అనుమానంతో మా శైలిలో విచారించాము. దిమ్మతిరిగే నిజం బయటపడింది” అని పోలీసులు తెలిపారు.

విశాఖ జిల్లాలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను వెస్ట్ ఏసీపీ పృథ్వితేజ మీడియాకు వివరించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న వృద్ధురాలి అనుమానస్పద మృతి కేసును గంటల వ్యవధిలోనే చేధించామన్నారు.

”నిన్న ఉదయం అప్పన్నపాలెంలోని వర్షిని అపార్ట్ మెంట్స్ లో ఓ వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయని మాకు సమాచారం వచ్చింది. మృతురాలు జయంతి మహాలక్ష్మి (63) కోడలే మాకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే అంతా అనుమానాస్పదంగా ఉంది. దాంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం.

అత్త కుర్చీలో ఉంది. ఆమె కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. కాళ్లు చేతులు కూడా కట్టేసి ఉన్నాయి. దొంగ పోలీస్ ఆట ఆడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కోడలు తెలిపింది. ఈ ప్రమాదంలో నిందితురాలి కూతురికి కాలిన గాయాలయ్యాయి. మేము ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని విచారించగా అందులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

అందులో ఒక వ్యక్తిని ఎలా చంపాలి? ఎలా తప్పించుకోవాలి? అనే విధంగా సెర్చ్ చేసినట్లు గుర్తించాము. అత్త కోడళ్లకు గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. ప్లాన్ ప్రకారమే 6వ తేదీన పెట్రోల్ బంకులో బాటిల్ లో పెట్రోల్ పట్టుకొని ఇంటికి తీసుకొచ్చింది కోడలు. మనవరాలితో కలిసి ఈ ఆట ఆడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది. అత్త పెట్టిన వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది. నిందితురాలిని అరెస్ట్ చేశాము” అని ఏసీపీ తెలిపారు.

Also Read: కళ్లల్లో కారం కొట్టి నగల షాపులో చోరీకి మహిళ యత్నం.. ఆమె తుక్కు రేగ్గొట్టిన యువకుడు..