నా చావుకి కారణం SI నారాయణమ్మ : చెరువులోకి దూకి విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి మురళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసుల వేధింపులే కారణం అని మురళి వాయిస్

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి మురళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసుల వేధింపులే కారణం అని మురళి వాయిస్
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి మురళి గన్నవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసుల వేధింపులే కారణం అని మురళి వాయిస్ మేసేజ్ పెట్టాడు. గన్నవరం ఎస్ఐ నారాయణమ్మ కొన్నాళ్లుగా తనను వేధిస్తోందని మురళి వాయిస్ మేసేజ్ లో తెలిపాడు. ఎస్ఐ నారాయణమ్మ తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని వాపోయాడు. చనిపోవడానికి ముందు మురళి.. తన కుటుంబసభ్యులకు వాయిస్ మేసేజ్ పంపాడు. తనకు హెల్ప్ చేయాలని అందులో కోరాడు.
ఎస్ఐ భర్త వాహనాన్ని ఢీకొట్టడం వల్లే నారాయణమ్మ వేధించిందని మురళి బంధువులు చెబుతున్నారు. విజయవాడలోని ఓ కాలేజీలో మురళి డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రాత్రి సమయంలో టీ స్టాల్ నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎస్ఐ భర్త వాహనాన్ని మురళి తన బండితో ఢీకొట్టాడు. అప్పటి నుంచి ఎస్ఐ నారాయణమ్మ మురళిని వేధిస్తోందని మురళి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె వేధింపులు తట్టుకోలేక గన్నవరం చెరువులోకి దూకి చనిపోయాడని చెప్పారు.
విద్యార్థి మురళి మృతదేహాన్ని పోలీసులు చెరువు నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మురళి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. వాయిస్ మేసేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఎస్ఐ నారాయణమ్మ కారణం అంటూ మురళి చేసిన వ్యాఖ్యలపైనా దర్యాఫ్తు చేపట్టారు. మురళి మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.