Delhi : లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి కారు ఎత్తుకుపోయిన దొంగలు

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి కారునే ఎత్తుకుపోయారు దొంగలు.

Delhi : లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి కారు ఎత్తుకుపోయిన దొంగలు

Driver Gives Lift To Men For Money. They Use Chilli Powder To Steal car

Updated On : November 29, 2022 / 3:58 PM IST

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు మరీ బరితెగించారు. అర్థరాత్రి లేదు పట్టపగలు లేదు. దోపిడీలతో హడలెత్తిస్తున్నారు. నోయిడాలో ఏకంగా పట్టపగలే లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి ఆకారునే ఎత్తుకుపోయారు. నోయిడాలోని సెక్టార్‌-93లో ఉండే ఓ వ్యక్తి ఢిల్లీలో పని చేస్తున్నాడు. రోజులాగానే టాటా హ్యారియర్ కారులో బయలుదేరాడు. అతను కారులో వెళ్తుండగా మధ్యలో నలుగురు వ్యక్తులు ఆపి లిఫ్ట్‌ అడిగారు. మేం అంతా ఢిల్లీ వెళ్తున్నామని..దయచేసి లిఫ్ట్ ఇవ్వండి..దానికి తగినంత డబ్బులు కూడా ఇచ్చేస్తామని కోరారు. దానికి అతను ఒప్పుకున్నాడు. అసలే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. నలుగురిని ఎక్కించుకుంటే కాస్త గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడేమో మరి..సరేనంటూ నలుగురిని కారు ఎక్కించుకున్నారు. అలా కాస్త దూరం వెళ్లాక లిఫ్టు అడిగికారు ఎక్కినవారి అసలు స్వరూపం బయటపెట్టారు.

అలా కారు వెళుతుండగా కారులో కూర్చున్న నలుగురు వారి కూడా తెచ్చుకున్న కారంపొడిని తీసి కారు యజమాని కళ్లలో కారం కొట్టారు. దీంతో అతను షాక్ అయ్యేంత సమయం కూడా లేదు. కళ్లు భగ్గున మండిపోవటంతో కారును సడెన్ బ్రేక్ వేసి ఆపాడు. అంతే కారులో ఉన్న నలుగురు తాపీగా కారు దిగి కారు యజమానిని బలవంతంగా కారు దింపేసి..రోడ్డు పక్కన పడేసి కారును గురుగ్రామ్‌, హరియాణా వైపు గా డ్రైవ్ చేసుకుంటు వెళ్లిపోయారు.

ఈ ఘటనపై నోయిడా సెక్టార్‌ 20 పోలీస్‌స్టేషన్‌లో సెప్టెంబరు 23న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఫేజ్‌ 2 పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితులు ఉన్నట్లు గుర్తించి వారిలో ఇద్దరిని ఆదివారం (నవంబర్ 28,2022) అదుపులోకి తీసుకున్నామని సెంట్రల్‌ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మియాన్‌ ఖాన్‌ మీడియాకు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారి కోసగం గాలిస్తున్నామని తెలిపారు.