Delhi Most Unsafe For Women Again and Again
Unsafe For Women: మహిళలపై అత్యాచారాలు, దాడుల్లో తన నెంబర్ వన్ ప్రస్థానాన్ని దేశా రాజధాని ఢిల్లీ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో విడుదల చేసిన లెక్కల్లో ఎక్కువ నేరాలతో ఢిల్లీ మరోసారి మహిళలకు కనీస రక్షణ లేని నగరాల జాబితాలో మొదటిస్థానాన్ని పదిల పర్చుకుంది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఢిల్లీలో 2021లో మహిళలపై 13,892 నేరాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. 2020లో ఈ నేరాల సంఖ్య 9,782 మాత్రమే.
కాగా, మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాల నేర లెక్కలు తీయగా ఇందులో ఒక్క ఢిల్లీనే 32 శాతం వాటాకు కలిగి ఉంది. అంటే 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన ప్రతి వంద నేరాల్లో 32 నేరాలు ఒక్క ఢిల్లీలోనే నమోదు అయ్యాయి. కాగా, ఢిల్లీ తర్వాత ఎక్కువ నేరాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నమోదు అయ్యాయి. ముంబైలో 5,543 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు 3,127 కేసులతో మూడవ స్థానంలో ఉంది. 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన నేరాల్లో ముంబై, బెంగళూరు వాటా 7.2 శాతం.
దాదాపు అన్ని రకాల నేరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ముందు వరుసలో ఉంది. మహిళలపై జరిగిన వివిధ రకాల నేరాల్లో మిగతా నగరాలకంటే కొన్ని రెట్లు ఎక్కువ కేసులు ఢిల్లీలో నమోదు అయ్యాయి. కిడ్నాపింగ్ 3948, భర్త వేధింపులు 4674, చిన్నారి బాలికలపై అత్యాచారాలు 833 కేసులు 2021 ఏడాదికి గాను ఒక్క ఢిల్లీలోనే నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో పేర్కొంది.
Bulldozer: వరకట్నం వేధింపుల బాధితురాలికి మద్దతుగా ఇంటి మీదకు వెళ్లిన బుల్డోజర్