Bulldozer: వరకట్నం వేధింపుల బాధితురాలికి మద్దతుగా ఇంటి మీదకు వెళ్లిన బుల్డోజర్

మొట్టమొదటి సారిగా వరకట్న వేధింపులకు గురై ఇంటి నుంచి గెంటివేయబడ్డ ఒక మహిళ కోసం ఒక ఇంటిపైకి బుల్డోజర్ వెళ్లింది. పద్దతి మార్చుకోకపోతే టాప్ లేచిపోతుందని బెదిరించి మొత్తానికి దంపతుల్ని ఒక చోటకు చేర్చింది. ఉత్తరప్రదేశ్‭లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇది కూడా అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు జరగడం విశేషం.

Bulldozer: వరకట్నం వేధింపుల బాధితురాలికి మద్దతుగా ఇంటి మీదకు వెళ్లిన బుల్డోజర్

Bulldozer At UP Home As Daughter-In-Law Denied Entry

Bulldozer: నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారనో మరో కారణాల చేతనో యూపీలో, ఢిల్లీలో ఉన్న ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం చూస్తూనే ఉన్నాం. కానీ మొట్టమొదటి సారిగా వరకట్న వేధింపులకు గురై ఇంటి నుంచి గెంటివేయబడ్డ ఒక మహిళ కోసం ఒక ఇంటిపైకి బుల్డోజర్ వెళ్లింది. పద్దతి మార్చుకోకపోతే టాప్ లేచిపోతుందని బెదిరించి మొత్తానికి దంపతుల్ని ఒక చోటకు చేర్చింది. ఉత్తరప్రదేశ్‭లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇది కూడా అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు జరగడం విశేషం.

నూతన్ మాలిక్ అనే మహిళకు కొద్ది సంవత్సరాల క్రితం రాబిన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వివాహం సమయంలో అంతటా జరిగినట్టే కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు, పెట్టుపోతలు జరిగాయి. ఇవి కాకుండా తమకు 5 లక్షల రూపాయల బొలెరో కావాలని భర్త డిమాండ్ చేశాడు. కట్నం డిమాండ్‭తో అత్తింటివారంతా కలిసి మాలిక్‭ని వేధించడం ప్రారంభించారు. అయితే మాలిక్ కుటుంబం వారి డిమాండ్ నెరవేర్చకపోవడంతో ఆమెను 2019లో ఇంట్లో నుంచి గెంటివేశారు.

అప్పటి నుంచి మాలిక్ వారి పుట్టింట్లోనే ఉంది. రాబిన్ కుటుంబంతో పలుమార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. దీంతో వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆమెను అత్తింటివారి ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను తీసుకుని రాబిన్ ఇంటికి వెళ్లగా.. వారు తలుపు తీయలేదు. ‘‘ఇది హైకోర్టు ఆదేశం.. తప్పనిసరిగా మీరు అనుమతించాల్సిందే’’ అని చెప్పినా వినలేదు. ఇక చేసేదేమీ లేక బుల్డోజర్ తీసుకువచ్చి హెచ్చరించారు. అనంతరం ఆమెను ఇంట్లోకి ఆహ్వానించారు.

Sharad Pawar: పవార్ వేలు పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చానన్న మోదీ.. పవార్ రియాక్షన్ ఏంటో తెలుసా?