WFI chief Brij Bhushan: గోండా వచ్చిన ఢిల్లీ పోలీసులు…బ్రిజ్ భూషణ్‌ను ప్రశ్నించారు

WFI chief Brij Bhushan: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు.డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌తో పాటు అతని మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. 12 మంది మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు గతంలోనే వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.

White House Race: వైట్ హౌస్ రేసులో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్…మాజీ బాస్ ట్రంప్‌కు సవాలు

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం యూపీలోని గోండాలోని బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి వచ్చారు.డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటివరకు మొత్తం 137 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.రెజ్లింగ్ కెరీయర్ లో సహాయం చేస్తానని చెప్పి లైంగికంగా తమను వేధించాడని కొందరు ఫిర్యాదు చేశారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం

అంతకుముందు ఏప్రిల్ 28వతేదీన ఢిల్లీ పోలీసులు డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు.సుప్రీంకోర్టు ఆదేశంతో బ్రిజ్ భూషణ్ పై పోలీసులు సెక్షన్ 354,354 ఎ, 354 డి, పోక్సో కింద కేసులు పెట్టారు.కాగా తనపై వచ్చిన ఒక్క ఆరోపణ రుజువైనా తాను ఉరివేసుకుంటానని చెబుతూ, అన్ని ఆరోపణలను సింగ్ ఖండించారు.మరో వైపు మహిళా రెజ్లర్లు తమ ఆందోళనకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు