White House Race: వైట్ హౌస్ రేసులో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్…మాజీ బాస్ ట్రంప్‌కు సవాలు

White House Race: వైట్ హౌస్ రేసులో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్…మాజీ బాస్ ట్రంప్‌కు సవాలు

Mike Pence Challenge to Trump

White House Race: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తన మాజీ బాస్ డోనాల్డ్ ట్రంప్‌కు సవాలుగా వైట్ హౌస్ రేస్‌లోకి దిగారు.(Challenge to Ex Boss Donald Trump)ఇందులో భాగంగా మైక్ పెన్స్ సోమవారం వైట్ హౌస్ బిడ్‌ను ప్రారంభించడానికి అధికారికంగా పత్రాలను దాఖలు చేశారు. పెన్స్(Former US Vice President Mike Pence) తన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల ప్రచారాన్ని వచ్చే వారం అయోవాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రం ఇండియానాకు బదులుగా అయోవాలో తన ప్రచారాన్ని ప్రారంభించాలనే మైక్ పెన్స్ బృందం నిర్ణయించుకుంది.

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

పెన్స్ ఒక సామాజిక సంప్రదాయవాది. ఆయన అబార్షన్ హక్కులను తీవ్రంగా వ్యతిరేకించారు.వచ్చే ఏడాది రాష్ట్రంలోని 99 కౌంటీలలో దూకుడుగా ప్రచారం చేయాలని యోచిస్తున్నట్లు సలహాదారులు చెబుతున్నారు.ఈయన 2016లో ట్రంప్ రన్నింగ్ మేట్‌గా ఎంపిక కావడానికి ముందు ఇండియానా గవర్నర్‌గా పనిచేశారు, 2020 ఎన్నికల్లో ట్రంప్‌తో విభేదించే వరకు నమ్మకమైన వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.