ఢిల్లీలో రూ.30 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం

  • Publish Date - September 20, 2019 / 09:01 AM IST

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఎత్తున మాదక  ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లారీ లో తరలిస్తున్న రూ.30 కోట్ల విలువైన హెరాయిన్ ను ఢిల్లీలోని మజ్నూ కా తిలా లో పట్టుకున్నారు.
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్  బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా ఇవి బయటపడ్డాయి. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు పశ్చిమ బెంగాల్ లోని మాల్దాకు చెందిన రెహ్మన్, అబు బక్కర్ సిద్దిఖిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.