Owner Killed : షాకింగ్.. దీపావళికి బోనస్, సెలవు ఇవ్వలేదని ఓనర్‌ని హత్య చేసిన సిబ్బంది

Dhaba Owner Killed By Staff : ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పండుగ జరుపుకుంటాము, మాకు సెలవు కావాలి, అలాగే పండగ బోనస్ కూడా ఇప్పించండి అని యజమానిని కోరారు.

Dhaba Owner killed By Staff (Photo : Google)

దీపాల పండుగ దీపావళి ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఇద్దరిని హంతకులుగా మార్చింది. అసలేం జరిగిందంటే.. దీపావళి పండక్కి బోనస్, సెలవు ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు సిబ్బంది తమ యజమానిని హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది.

పండగ బోనస్, సెలవు విషయంలో గొడవ..
రాజు బౌరావ్ డెంగ్రే(48) అనే వ్యక్తి నాగ్ పూర్ లో డాబా నడుపుతున్నారు. నాగ్ పూర్ – ఉమ్రెడ్ రోడ్డులోని పచగావ్ లో ఆయన డాబా ఉంది. ఆయన దగ్గర ఇద్దరు వ్యక్తులు (చోటు, ఆది) పని చేస్తున్నారు. వారిది మధ్యప్రదేశ్ రాష్ట్రం మండ్లా. డాబాలో పని చేసేందుకు డెంగ్రే దగ్గరికి వచ్చారు. అయితే, దీపావళి రావడంతో పండక్కి ఊరు వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని, అలాగే పండగ బోనస్ ఇవ్వాలని చోటు, ఆది.. డాబా యజమానిని అడిగారు. మేము మా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటాము, మాకు సెలవు కావాలి, అలాగే పండగ బోనస్ కూడా ఇప్పించండి అని యజమానిని కోరారు.

Also Read : ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 5వ తరగతి విద్యార్థినిపై టీచర్ల లైంగిక దాడి, టాయ్‌లెట్‌కి లాక్కెళ్లి

పండగ బోనస్, సెలవు ఇవ్వలేదని దారుణం..
శనివారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో డాబా ఓనర్ తో దీని గురించి మాట్లాడారు. అయితే బోనస్ కానీ, సెలవు కానీ ఇచ్చేందుకు డాబా ఓనర్ ఒప్పుకోలేదు. కుదరదని తేల్చి చెప్పారు. మరోసారి ఎప్పుడైనా చూద్దామని వారికి నచ్చచెప్పారు. ఇందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. ఈ విషయమై యజమానితో వారిద్దరూ గొడవ పడ్డారు. దీనిపై తీవ్ర వాగ్వాదం జరిగింది. సెలవు ఇవ్వను, డబ్బులు కూడా ఇవ్వను అని యజమాని తెగేసి చెప్పాక అక్కడి నుంచి వెళ్లి నిద్రపోయారు. సెలవు, బోనస్ ఇచ్చేది లేదని యజమాని తేల్చి చెప్పడంతో సిబ్బంది తీవ్రమైన కోపంతో రగిలిపోయారు. డాబా ఓనర్ ని చంపేయాలని నిర్ణయించుకున్నారు.

నిద్రపోతున్న సమయంలో ఘోరం..
కోపంలో ఉన్న వారు విచక్షణ కోల్పోయారు. నిద్రపోతున్న యజమాని గొంతుకి తాడు బిగించి చంపేశారు. ఆ తర్వాత యజమాని కారులోనే వారిద్దరూ పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా ఓ ఏజెంట్ ద్వారా చోటు, ఆదిలను నెల క్రితమే డాబా ఓనర్ పనిలోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు.

దీపావళి పండక్కి బోనస్ ఇవ్వలేదని, సెలవు ఇవ్వలేదని.. డాబా ఓనర్ ని సిబ్బంది హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బోనస్ ఇవ్వకపోతే, సెలవు ఇవ్వకపోతే చంపేస్తారా? ఇది దారుణం అని వాపోయారు.

Also Read : మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు, కట్ చేస్తే 70లక్షలు పోగొట్టుకున్నాడు.. దిమ్మతిరిగిపోయే మోసం

హత్య వెనుక రాజకీయ కోణం?
కాగా, పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా పక్కా ప్లాన్ చేసి డెంగ్రేను హత్య చేయించి ఉండొచ్చని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. మృతుడు డెంగ్రేకు రాజకీయ నేపథ్యం ఉంది. డెంగ్రే కుటుంబానికి గ్రామంలో బాగా పలుకుబడి ఉంది. పైగా వివాదరహితుడు కూడా. ఆయనకు బీజేపీ మద్దతు ఉంది. డెంగ్రే మాజీ గ్రామ సర్పంచ్ కూడా. ఇటీవలే జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా డెంగ్రే హత్యకు కుట్ర చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు