Dil Raju Son-in-law Car Theft: దిల్ రాజు అల్లుడు కారు చోరీ.. నిందితుడు చెప్పింది విని పోలీసులు ఏం చేశారో తెలుసా..?
దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి పోర్షే కారులో శుక్రవారం జూబ్లిహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లాడు. అక్కడ పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. అంతుకుముందే..

Dil Raju Son-in-law Car
Dil Raju Son-in-law : నీకు ఆకాష్ అంబానీ తెలుసా..? నేను హృతిక్ రోషన్ మేనేజర్ ను .. అంటూ ఓ వ్యక్తి ఏకంగా పోలీసులనే దబాయించాడు.. ఇంతకీ.. ఆ వ్యక్తి చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే షాకవుతారు! ఏకంగా కారును చోరీ చేశాడు. ఆ కారుకూడా చిన్నాచితకది కాదు.. ఖరీదైన కారు. దాని విలువ దాదాపు రూ.కోటికిపైనే ఉంటుంది. అదికూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడిది. చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు కారును గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేయడమే కాకుండా నిందితుడు పోలీసులపై చిందులు వేశాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. అసలు విషయం తెలిసింది.
దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి పోర్షే కారులో శుక్రవారం జూబ్లిహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లాడు. అక్కడ పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. అంతుకుముందే మల్లెల సాయికిరణ్ అనే యువకుడు స్కూటీపై హోటల్ పార్కింగ్ స్థలం వద్దకు వచ్చాడు. ఖరీదైన కార్లకోసం వెతికాడు. ఈ సమయంలోనే అర్చిత్ రెడ్డి పోర్షే కారులో రావడంతో సాయికిరణ్ కళ్లు ఆ కారుపై పడ్డాయి. అర్చిత్ రెడ్డి లోపలికి వెళ్లిన తరువాత కారు దగ్గరకు వెళ్లిన కిరణ్ కారును చాకచక్యంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. అర్చిత్ రెడ్డి పావుగంట తరువాత కారుపార్కింగ్ స్థలం వద్దకు వచ్చి చూడగా పోర్షే కారు కనిపించలేదు. పార్కింగ్ సిబ్బందిని ప్రశ్నించగా సరియైన సమాధానం రాకపోవటంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్, ఎస్ఐ రాజశేఖర్ రంగంలోకి దిగి సీసీ పుటేజిలను పరిశీలించారు. దీంతో కారు చోరీకి గురైనట్లు గుర్తించారు.
Read Also : Unstoppable 3 : మేము తప్పు చేయలేదని మీకు తెలుసు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య కామెంట్స్..
సీసీ పుటేజీల ఆధారంగా కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్టువైపు వెళ్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. కొద్ది సమయంలోనే సాయికిరణ్ దొంగిలించిన కారును కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. అతని చెప్పే మాటలకు పోలీసులు కంగుతిన్నారు. కారును తీసుకురావాలని మంత్రి కేటీఆర్ చెప్పాడని ఒకసారి.. తాను అకాశ్ అంబానీ మేనేజర్ ను అని ఒకసారి.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మేనేజర్ ను అని మరోసారి చెబుతూ పోలీసులకు దబాయింపుకు దిగాడు. పోలీసులకు అనుమానం వచ్చి సాయికిరణ్ పూర్తివివరాలను తెలుసుకోగా.. గతంలోనూ అతనిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఓ క్రిమినల్ కేసు ఉన్నట్లు గుర్తించారు. చివరికి నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. కారును దిల్ రాజు అల్లుడికి అప్పగించారు.