డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో విషాధం : నలుగురు కూలీలు మృతి

  • Publish Date - January 31, 2019 / 08:20 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న డబుల్ బెడ్ రూం నిర్మాణంలో విషాదం నెలకొంది. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా 10 అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. భవనం స్లాబు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో కూడా ఇళ్లు కడుతున్నారు. అయితే..జనవరి 31వ తేదీ గురువారం భవనంలోని పదో అంతస్తులో పనులు జరుగుతున్నాయి. భవనం పై అంతస్తు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో కొంతమంది కూలీలు వర్క్ చేస్తున్నారు. నలుగురు శిథిలాల కింద కూరుకపోయి చనిపోయారు. మరో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యియి. 

భవనం కూలిపోవడంతో ఇతర కూలీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషాద ఘటన దావానంలా వ్యాపించేసింది. సమాచారం అందుకున్న రాచకొండ, కీసర పోలీసు టీం నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

కానీ..ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరావడం లేదు. రాంపల్లిలో నిర్మాణమౌతున్న డబుల్ బెడ్ రూంలను ఏ బిల్డర్ చేపడుతున్నారు ? తెలియాల్సి ఉంది. బిల్డర్ క్వాలిటీ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఇళ్లు కట్టే సమయంలో… కూలీలు వర్క్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందా ? అసలు ప్రమాదానికి గల కారణాలేంటీ ? అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు..తెలియాల్సి ఉంది.