DRDO Scientist Arrest : హనీ ట్రాప్ లో చిక్కి పాక్ కు భారత రహస్య సమాచారం.. శాస్త్రవేత్త అరెస్టు

అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ తోపాటు ఇతర సెక్షన్ల కింద సదరు శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏటీఎస్ తెలిపింది.

DRDO Scientist Arrest

DRDO Scientist Arrest : హనీ ట్రాప్ లో చిక్కుకుని పాకిస్తాన్ కు భారత రహస్య సమాచారం అందించిన ఓ శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ లో పని చేస్తున్న ఓ శాస్త్రవేత్త వాట్సాస్ వీడియో కాల్స్ ద్వారా భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్ కు అందజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది.

డీఆర్ డీవో శాస్త్రవేత్త పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఏజెంట్ హనీ ట్రాప్ లో చిక్కినట్లు ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. వారితో నిరంతరం టచ్ లో ఉంటూ భారత్ కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ కు అందించినట్లు తెలిపారు. తన వద్ద ఉన్న దేశానికి సంబంధించిన రహస్య సమాచారం శత్రువులకు చేరితే దేశ భద్రతకు ముప్పు వాటిలిల్లుతుందని తెలిసినా ఆ శాస్త్రవేత్త అధికార దుర్వినియోగానికి పాల్పడి శత్రు దేశానికి రహస్య వివరాలు అందించాడని ఏటీఎస్ పేర్కొంది.

MEA Driver: హనీ ట్రాప్‭లో విదేశాంగ శాఖ డ్రైవర్.. పాక్ మహిళకు రహస్యాల చేరవేత
అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ తోపాటు ఇతర సెక్షన్ల కింద సదరు శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏటీఎస్ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే దానిపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. కాగా, అరెస్టైన శాస్త్రవేత్త ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఉన్నత పదవిలో ఉన్నట్లు తెలిపింది.