Srisailam Drone : శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం.. ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్

డ్రోన్ ఎగరవేసిన వారి కోసం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

Srisailam Drone : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టింది. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఆశాశంలో ఎగిరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్ ను ఎగరవేసిన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. డ్రోన్ ఎగరవేసిన వారి కోసం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

మరోవైపు ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే డ్రోన్స్ చక్కర్లు కొడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేకసార్లు డ్రోన్లు చక్కర్లు కొడుతున్నప్పటికీ అధికారులు పూర్తిగా వైఫ్యలం చెందారన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. అర్ధరాత్రి సమయంలో ఆలయంపై ఆశాశంలో డ్రోన్లు చక్కర్లు కొట్టడంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంపై అర్ధరాత్రి డ్రోన్ చక్కర్లు కొట్టడంపై స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Tirumala Drone : తిరుమలలో డ్రోన్ కలకలం.. త్వరలో కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ-టీటీడీ కీలక నిర్ణయం

కాగా, ఈ విషయంలో శ్రీశైలం అధికారులు, దేవాదాయ, సెక్యూరిటీ పూర్తిగా వైఫల్యం చెందారని అంటున్నారు. చెక్ పోస్టులు ఉన్నప్పటికీ సరిగ్గా చెక్ చేయకపోవడంతోనే ఆలయంపై ఈ డ్రోన్ కెమెరాలు ఎగరవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయకుండా చూడటంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అనేకసార్లు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో డ్రోన్ల కలకలం రేగింది.

తాజాగా ఆలయంపై అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం ఇది నాలుగోసారి. ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొడుతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను ఎగరవేసిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. వాటిపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు