Tirumala Drone : తిరుమలలో డ్రోన్ కలకలం.. త్వరలో కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ-టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల భద్రత విషయంలో టీటీడీ ఎక్కడా రాజీపడటం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో అన్నదానం నుంచి డంపింగ్ యార్డు వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ కు పర్మిషన్ ఇచ్చామని తెలిపారాయన. ఇప్పటికే డ్రోన్ వ్యవహారంపై కేసు నమోదు చేశామని చెప్పారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా? లేక గూగుల్ వీడియోలా? అన్నది తేలాల్సి ఉందన్నారు.

Tirumala Drone : తిరుమలలో డ్రోన్ కలకలం.. త్వరలో కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ-టీటీడీ కీలక నిర్ణయం

Tirumala Drone : తిరుమల భద్రత విషయంలో టీటీడీ ఎక్కడా రాజీపడటం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో అన్నదానం నుంచి డంపింగ్ యార్డు వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ కు పర్మిషన్ ఇచ్చామని తెలిపారాయన. ఇప్పటికే డ్రోన్ వ్యవహారంపై కేసు నమోదు చేశామని చెప్పారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా? లేక గూగుల్ వీడియోలా? అన్నది తేలాల్సి ఉందన్నారు.

డ్రోన్ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియోలు తీసుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గూగుల్ వీడియోలు అయితే ఏమీ చేయలేము అన్న ధర్మారెడ్డి.. త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని చెప్పారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఏర్పాటుకు బీఈఎల్ ను సంప్రదిస్తున్నామని వెల్లడించారు.

Also Read..Drone Cameras In Tirumala : తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం.. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ వీడియోలు వైరల్

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. డ్రోన్ కెమెరా సాయంతో శ్రీవారి ఆలయం దృశ్యాలు చిత్రీకరించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తిరుమలలో భద్రత డొల్లేనంటూ భక్తులు మండిపడుతున్నారు. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.

”తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడబోము. తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదైంది. త్వరలోనే తిరుమలకు అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తున్నాం. ఇది ఎంతో ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ, భద్రతకే ప్రాధాన్యత ఇచ్చి ముందడుగు వేస్తున్నాం. ఎవరైనా డ్రోన్లు ఎగరేస్తే, ఆ డ్రోన్లలో ఉండే కెమెరాలు పని చేయకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుంది” అని ధర్మారెడ్డి వివరించారు.

Also Read..Tirumala Temple Drone Visuals : తిరుమలలో డ్రోన్ అలజడి.. ఆ వీడియోలు తీసిన నిందితుల కోసం పోలీసుల వేట

అత్యుత్సాహంతోనే శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్టు తెలుస్తోందని, ఆ వీడియోను ల్యాబ్ కు పంపామని ధర్మారెడ్డి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, ఆ వీడియోలు వైరల్ అవడం దుమారం రేపింది. అత్యంత భద్రత ఉండే తిరుమల కొండపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ షాక్ కు గురి చేసింది. శ్రీవారి ఆలయం దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన నిందితులను వదిలిపెట్టేది లేదన్నారు టీటీడీ అధికారులు. హైదరాబాద్ యువకులు ఈ వీడియో తీసి, ఐకాన్ అనే అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో అప్ లోడ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.