Hyderabad Drugs : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

బర్త్ డే రోజున 30మంది ఫ్రెండ్స్ కోసం డ్రగ్ పార్టీ ప్లాన్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసి పార్టీకి ప్లాన్ చేశారు.

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి కొందరు యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు.

మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రేమ్ చంద్ తన బర్త్ డే రోజున 30మంది ఫ్రెండ్స్ కోసం డ్రగ్ పార్టీ ప్లాన్ చేశారు. సంపత్.. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసి పార్టీకి ప్లాన్ చేశారు.

Also Read : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్య.. నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కలకలం

అశోక్ యాదవ్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు మైత్రీవనం వద్ద నిఘా ఉంచారు. డ్రగ్స్ విక్రయించడానికి అశోక్ ప్రయత్నిస్తుండగా మైత్రీవనం దగ్గర పోలీసులు అశోక్ ను పట్టుకున్నారు. విచారణలో అతడిచ్చిన సమాచారం ఆధారంగా రాజేశ్, సాయి చరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ ది నెల్లూరు జిల్లా. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అమీర్ పేట్ లో హాస్టల్ లో ఉంటున్నాడు. నిందితులు ముగ్గురు గోవాకు పలుమార్లు వెళ్లారు. అదే సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడ్డారు.

నగరంలో డ్రగ్స్ కున్న డిమాండ్ ను బట్టి సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ విక్రయించాలని నిర్ణయించారు. గోవాలో బాబా అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు నిందితులు. ఒక్కో సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్ వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి నగరంలో రూ.2500కు విక్రయిస్తోంది రాజేశ్ అండ్ గ్యాంగ్. నిందితులు హైదరాబాద్ తో పాటు నెల్లూరులో కూడా పిల్స్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. న్యూ ఇయర్ సందర్భంగా సాయి చరణ్ 60 సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ కొనుగోలు చేసి తీసుకొచ్చాడు.

Also Read : తిరుపతిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆ తర్వాత..

ఇలా తీసుకొచ్చిన డ్రగ్స్ ను విక్రయించే ప్రయత్నంలో అశోక్ యాదవ్ పోలీసులకు చిక్కాడు. రాజేశ్, సాయిచరణ్, అశోక్ యాదవ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 0.497 ఎక్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వినియోగదారులను గుర్తించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించగా.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పక్కా సమాచారం మేరకు ఎక్కడికక్కడ డ్రగ్స్ ముఠాలను కట్టడి చేసే పనిలో ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. అదే తరహాలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ బ్యూరో అధికారులు ఏకకాలంలో సోదాలు చేసి అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 30 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి బర్త్ డే పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు. ప్రేమ్ చంద్ బర్త్ డే సందర్భంగా డ్రగ్ పార్టీ ప్లాన్ చేశారు. పట్టుబడిన వారిలో 12మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఉండటం షాక్ కి గురి చేస్తోంది.

బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో పిల్లలు ఇలా పెడదోవ పట్టడం, డ్రగ్స్ కు బానిసలు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకునే కల్చర్ ఆందోళన కలిగించే విషయం. పిల్లల జల్సాలకు డబ్బులు ఇచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం గొప్ప విషయం కాదు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి వాటిపై కచ్చితంగా తల్లిదండ్రులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు. పిల్లలు పెడదోవ పట్టారంటే అందులో తల్లిదండ్రుల పాత్ర కచ్చితంగా ఉందంటున్నారు పోలీసులు. వారి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు