Tirupati: తిరుపతిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆ తర్వాత..

గోవింద్‌ అనే యువకుడికి మానసతో ఇటీవల వివాహం జరిగింది. అంతకు ముందే మానస మరో అబ్బాయితో..

Tirupati: తిరుపతిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆ తర్వాత..

representative image

Updated On : December 17, 2023 / 6:57 PM IST

Tirupati: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. ఆ తర్వాత తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని చిగురువాడలో చోటు చేసుకుంది.

గోవింద్‌ అనే యువకుడికి మానసతో ఇటీవల వివాహం జరిగింది. అంతకు ముందే మానస మరో అబ్బాయితో ప్రేమాయణం కొనసాగించింది. భర్త గోవింద్‌ను హతమార్చితే తన ప్రియుడితో కలిసి ఉండవచ్చని మానస భావించింది. గోవింద్‌ను ప్రియుడితో కలిసి గొంతు నులిమి హతమార్చింది.

ఆ తర్వాత అమాయకురాలిలా నటించింది. భర్త బంధువులకు ఫోన్ చేసి, అప్పుల బాధ తాళలేక గోవింద్ బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గోవింద్, మానస ఇంటికి ఓ యువకుడు వచ్చినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. మానసతో పోలీసులు అసలు విషయాన్ని కక్కించారు. తానే భర్తను హతమార్చినట్లు ఆమె అంగీకరించింది. మానసను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Punjab: జైళ్లలో డ్రగ్స్‭పై తీవ్ర ఆరోపణలు.. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సిద్ధూ ఛాలెంజ్