Son Murders Mother: రూ.100 ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు

తాగుడుకి బానిసయినా ఓ యువకుడు..మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే హతమార్చాడు

Son Murders Mother: మనుషుల తీరు అర్ధం కావడంలేదు. నేటి రోజుల్లో మానవ సంబంధాలు, విలువలు ఎంత దారుణంగా పడిపోతున్నాయో చెప్పే ఉదంతం ఇది. తాగుడుకి బానిసయినా ఓ యువకుడు..మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రం మయూర్ భంజ్ జిల్లా జాసిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా కధనం ప్రకారం జాసిపూర్ పరిధిలోని హటపడియ గ్రామానికి చెందిన సరోజ్ నాయక్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం సారా సేవించి వచ్చి తల్లి శాలందిని ఇబ్బంది పెట్టేవాడు. కొడుకు తప్పుదారి పడుతున్నా ఏమి చేయలేక ఆ తల్లి ఆవేదనకు గురైంది.

Also read:AP Schools Summer Holidays : ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..

ఈక్రమంలో ఏప్రిల్ 22న పూటుగా మద్యం సేవించి వచ్చిన సరోజ్ నాయక్..మరోసారి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ తల్లితో గొడవ పడ్డాడు. ఇప్పటికే మద్యం ఎక్కువగా తాగి ఉన్నావని, తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని తల్లి శాలంది చెప్పడంతో..ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన సరోజ్..కర్రతో తల్లి తలపై గట్టిగా కొట్టాడు. దీంతో శాలంది అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి సరోజ్ నాయక్ పారిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న జాసిపూర్ పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు సరోజ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read:Jammu and Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. పాక్ తీవ్రవాది హతం

ట్రెండింగ్ వార్తలు