Eight Inmates Escape From Juvenile Home
Inmates Escape : మధ్యప్రదేశ్‌లోని మొరెనాలోని జువెనైల్ హోమ్ నుంచి 8 మంది బాలనేరస్థులు తప్పించుకొని పారిపోయారు. అత్యాచారం, హత్యలతో సహా వివిధ నేరాలకు పాల్పడిన 8 మంది బాల నేరస్థులు పరారైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు. (Juvenile Home In Madhya Pradesh) ఆదివారం రాత్రి నైనగర్ రోడ్డులోని జువైనల్ హోమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో సహా 12 మంది జువైనల్ అండర్ ట్రయల్‌లలో 8 మంది ఆదివారం రాత్రి 7 గంటలకు బాత్రూమ్ గోడను పగులగొట్టి తప్పించుకున్నారని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అతుల్ సింగ్ తెలిపారు.
NCP files disqualification petition : రెబెల్స్ అజిత్‌తోపాటు మరో 8 మందిపై ఎన్సీపీ అనర్హత పిటిషన్
జువైనల్ హోమ్‌లో ప్రత్యేక సాయుధ దళం గార్డు రాత్రి 8 గంటలకు కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారని, ఆ తర్వాత పోలీసులు ఖైదీల కోసం వెతకడం ప్రారంభించారని ఎస్పీ చెప్పారు. తప్పించుకున్న యువకులు మోరెనా, భింద్ మరియు షియోపూర్ జిల్లాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు.