NCP files disqualification petition : రెబెల్స్ అజిత్‌తోపాటు మరో 8 మందిపై ఎన్సీపీ అనర్హత పిటిషన్
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్‌తో పాటు మరో 8 మంది శాసనసభ్యులపై ఆ పార్టీ అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది....

NCP files disqualification petition
NCP files disqualification petition : మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్‌తో పాటు మరో 8 మంది శాసనసభ్యులపై ఆ పార్టీ అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తో పాటు మరో 8 మంది శాసనసభ్యులపై తమ పార్టీ అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసినట్లు మహారాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారు. (against Ajit Pawar, 8 others after rebellion) ఈ మేరకు అనర్హత పిటిషన్ ను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కు సమర్పించారు.
NCP working president Supriya Sule : రెబెల్స్ తిరిగి వస్తే సంతోషిస్తాం.. సుప్రియాసూలే వ్యాఖ్యలు
అన్ని జిల్లాల పార్టీ కార్యకర్తలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అండగా ఉన్నారని పేర్కొంటూ పార్టీ ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించింది. శరద్ పవార్ సూచనల మేరకే అజిత్ పవార్ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. 1999లో శరద్ పవార్ స్థాపించిన పార్టీలో అతని మేనల్లుడు అజిత్ పవార్ విచ్ఛిన్నం చేసి, శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు.
BCCI Announces Women’s Squad : బంగ్లాదేశ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు… బీసీసీఐ ప్రకటన
ఎన్సీపీలో శాసనసభ్యుల తిరుగుబాటుపై జయప్రకాష్ దండేగావ్కర్ నేతృత్వంలోని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశామని, వారి సిఫారసు మేర 9మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ను ఎన్సీపీ రాష్ట్రశాసనభకు మెయిల్ ద్వారా పంపించిందని ఆదివారం అర్థరాత్రి విలేకరుల సమావేశంలో పాటిల్ చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై తాను నేరుగా ప్రజల వద్దకే వెళతానని శరద్ పవార్ చెప్పారు. కాగా ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ తన వెంట ఉన్నారని, వారు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఒక పార్టీగా చేరారని అజిత్ పవార్ చెప్పారు.