దారుణం – మలద్వారం నుంచి గాలిని పంపిన యజమాని, కార్మికుడు మృతి

employer allegedly pumps air into rectum with compressor : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒక కార్మికుడిని శిక్షించటానికి యజమాని తోటి కార్మికుల సహాయంతో అతడి మల ద్వారం లోకి కంప్రెషర్ ద్వారా గాలిని పంపించాడు. దీంతో ఆ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మరణించాడు.
బాధితుడి సోదరుడు ధనిక్ రామ్ ధాకద్ చెప్పిన వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్ ష శివపురి లోని గోబర్ధన్ లో …నవంబర్ 6వ తేదీన నా సోదరుడు ఉదయం పనికి వెళ్లాడు. అక్కడ యజమాని, నా సోదరుడ్ని శిక్షించే క్రమంలో అతని మలద్వారంలోకి కంప్రెషర్ ద్వారా గాలిని నింపాడు. దీంతో అతడు స్పృహ తప్పిపడిపోయాడు. ఈవిషయాన్నితోటి కార్మికులు…ధనిక్ రామ్ కు ఫోన్ చేసి చెప్పారు. మీ సోదరుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో స్పృహ తప్పి పడిపోయాడని …అతడ్ని ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం ఇచ్చారు.
ఆ సమాచారం తో ఆస్పత్రికి చేరుకున్న ధనిక్ రామ్ కు అతని సోదరుడు జరిగిన విషయం చెప్పాడు. యజమాని తనను శిక్షించే క్రమంలో కంప్రెషర్ ద్వారా మలద్వారం నుంచి గాలిని లోపలకు పంపాడని వివరించాడు. దీంతో బాధితుడ్ని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స ఇవ్వటం ప్రారంభించారు.
దాదాపు 45 రోజుల అనంతరం చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. కాగా ఈవిషయమై బాధిత కుటుంబ సభ్యులు యజమానికి భయపడి ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఆదివారం డిసెంబర్ 17న తన దృష్టికి వచ్చిందని… ఈవిషయమై వెంటనే విచారణ జరపాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు శివపురి పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.