Engineering Student Suspicious Death
Suspicious Death : విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన మున్నీ అనే విద్యార్ధిని విజయవాడ లయోలా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది.
ఆమె స్ధానికంగా ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే తరుణ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. 20 రోజులుగా వారిద్దరూ తరుణ్ గదిలోనే గడిపారు. ఈ క్రమంలో తరుణ్ ఆమెను అనుమానించటం మొదలెట్టాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన మున్నీ జులై 23న ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన తరుణ్ నేరుగా మాచవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాగా చికిత్స పొందుతూ మున్నీ మృతి చెందింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను వంచించాడని… తరుణ్ కొట్టటం వలనే తమ కుమార్తె చనిపోయిందని మున్నీ తల్లితండ్రులు ఆరోపించారు.