అంతా క్షేమం: కృష్ణానదిలోతప్పిన బల్లకట్టు ప్రమాదం

  • Publish Date - February 5, 2019 / 09:54 AM IST

విజయవాడ :కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం  రామన్న పేట వద్ద  కృష్ణానదిలో  మంగళవారం బల్లకట్టు మునిగింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి కృష్ణా జిల్లా రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. బల్లకట్టుపై లారీ, కారు, 2టాటా ఏస్ వాహనాలు, కొన్ని ద్విచక్రవాహనాలు ఉన్నాయి. 

కృష్ణా నది ఒడ్డునే ఈ దుర్ఘటన జరగటంతో బల్ల కట్టుపై ఉన్న సుమారు 20 మందిని  స్ధానికులు, మత్స్యాకారులు క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. బల్లకట్టుపై పరిమితికి మించి బరువు వుండటం వల్ల ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది. నీటిలో మునిగిపోయిన వాహనాలను అధికారులు  బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.