మెర్సీ డెత్ కోరుతూ…రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబసభ్యుల లేఖ

నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతున్న సమయంలో నలుగురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. నిందితులను యుథనేసియా(నొప్పి లేకుండా చంపుట)ద్వారా చంపేయాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ ప్రకారం మార్చి-20,2020 ఉదయం 5గంటల 30నిమిషాలకు నలుగరు నిందితులను ఒకేసారి ఉరితీయనున్నారు.

రిపోర్టుల ప్రకారం…నలుగురు దోషుల కుటుంబసభ్యుల నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు 13లెటర్లు వచ్చాయి. ఇందులో రెండు లెటర్లను నిందితుల్లో బకడైన ముఖేష్ కుటుంబసభ్యులు పంపించినవి కాగా,మరో నిందుతుడైన అక్షయ్ కుటుంబస్యభులు పంపినవి 3లెటర్లు ఉన్నాయి. ఇక మిగిలిని ఇద్దరు నిందితులు పవన్,వినయ్ ల కుటుంబసభ్యులు ఒక్కొక్కరు నాలుగేసి చొప్పున రాష్ట్రపతికి లేఖలు పంపారు.

యుథనేసియా అంటే ఏమిటి?
దీనిని మెర్సీ కిల్లింగ్ అని కూడా అంటారు. దయ కారణాల వల్ల నొప్పి మరియు బాధలను తగ్గించడానికి ఒక జీవితాన్ని చంపడం లేదా ఉద్దేశపూర్వకంగా ముగించే చట్టం.

See Also | యువకుడిని నగ్నంగా చేసి..యూరిన్ పోస్తూ..పైశాచిక ఆనందం

ట్రెండింగ్ వార్తలు