తీవ్ర విషాదం : బర్త్ డే కేక్ తిని తండ్రి, కొడుకు మృతి
పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషం కలిపిన కేక్ తిని తండ్రీకొడుకులు చనిపోయారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం

పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషం కలిపిన కేక్ తిని తండ్రీకొడుకులు చనిపోయారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం
పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషం కలిపిన కేక్ తిని తండ్రీకొడుకులు చనిపోయారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్‌లో ఈ ఘటన జరిగింది. రమేష్(39) తన కుమారుడు రాంచరణ్(9) పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. తల్లి భాగ్యలక్ష్మి(35), కూతురు పూజిత(12) అంతా వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తిన్నారు. అంతే.. తండ్రి, కొడుకు వెంటనే చనిపోయారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, రాంచరణ్ బాబాయ్ శ్రీనివాస్ కేక్‌లో విషం కలిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదమ్ముల మధ్య భూవివాదమే ఈ దారుణానికి కారణమని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పుట్టిన రోజు నాడు విషాదం జరిగింది. విషం కలిపిన కేక్ తిని తండ్రి, కొడుకు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఆస్తి కోసం సొంత తమ్ముడే రాక్షసుడిలా మారాడు. అన్న కుటంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. పుట్టిన రోజుకు విషం కలిపిన కేక్ పంపించాడు. బుధవారం(సెప్టెంబర్ 4,2019) సాయంత్రం రమేష్ తన కొడుకు చరణ్ బర్త్ డే వేడులకు నిర్వహించాడు. కేక్ తిన్న తర్వాత కుటుంబసభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బంధువులు వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో తండ్రి రమేష్, కొడుకు రాంచరణ్ మృతి చెందారు. కూతరు ఐసియూలో, తల్లి జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. రాంచరణ్ పుట్టిన రోజుకి అతడి బాబాయ్ శ్రీనివాస్ కేక్ పంపించినట్టు పోలీసులు తెలిపారు.
చాలాకాలంగా రమేష్, శ్రీనివాస్ మధ్య భూవివాదం నడుస్తోంది. సిద్ధిపేటలోని ఓ స్థలం విషయంలో సోదరుల మధ్య గతంలో గొడవలు జరిగాయి. స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కుట్రపన్నిన శ్రీనివాస్ అన్న కుమారుడి పుట్టిన రోజుని అవకాశంగా మార్చుకున్నాడు. విషం కలిపిన కేక్ తో అన్న ఫ్యామిలీని చంపాలని ప్రయత్నించాడు. తమ్ముడి కుట్ర తెలియక అతడు పంపించిన కేక్ తిని రమేష్, అతడి కుమారుడు చరణ్ ప్రాణాలు కోల్పోయారు. తన భర్త తమ్ముడే కేక్ లో విషం కలిపాడని భాగ్యలక్ష్మి ఆరోపిస్తోంది. కేక్ పంపిస్తామని చెబితే వద్దని చెప్పినా వినిపించుకోలేదని, బలవంతం చెయ్యడంతోనే ఆ కేక్ తీసుకున్నామని భాగ్యలక్ష్మి తెలిపింది. తమ కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నిస్తాడని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరు అయ్యింది. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.