తండ్రి పైశాచికత్వం: వాక్యూమ్ క్లీనర్ తో కొడుకుని చావబాదాడు!

పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటారు. చదవమంటే చాలు.. సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులే ఏదోలా నచ్చజెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పైశాచికత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇలా పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన తండ్రి చివరికి కటకటాలపాలయ్యాడు.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 11:29 AM IST
తండ్రి పైశాచికత్వం: వాక్యూమ్ క్లీనర్ తో కొడుకుని చావబాదాడు!

Updated On : January 4, 2019 / 11:29 AM IST

పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటారు. చదవమంటే చాలు.. సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులే ఏదోలా నచ్చజెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పైశాచికత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇలా పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన తండ్రి చివరికి కటకటాలపాలయ్యాడు.

  • హోంవర్క్ చేయలేదనే కోపంలో తండ్రి పైశాచికత్వం

  • తీవ్రగాయాలతో కోమాలో కుమారుడు.. పరిస్థితి విషమం

పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటారు. చదవమంటే చాలు.. సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులే ఏదోలా నచ్చజెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పైశాచికత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇలా పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన తండ్రి చివరికి కటకటాలపాలయ్యాడు. పిల్లాడు చేసిన పాపం ఒకటే.. హోం వర్క్ చేయకపోవడం. ఇంతదానికే ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఆరేళ్ల కుమారుడిని వాక్యూమ్ క్లీనర్ పైపుతో చావగొట్టాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు ఆ పసిప్రాణం తల్లడిల్లి చివరికి కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటన టర్కీలోని హటాయ్ ప్రావిన్స్ ఇస్కేందర్ సిటీలో చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న పిల్లాడిని పక్కంటివారు గుర్తించి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. తండ్రి కొట్టిన దెబ్బలకు ముఖం, తలపై తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు వెల్లడించారు.

వెంటనే బాలుడిని ఐసీయూకి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాలుడి తల్లి గులిస్టాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రి మెహమట్ అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి గులిస్టాన్ మాట్లాడుతూ.. విషయం తెలియగానే ఆస్పత్రికి బయల్దేరి వచ్చాను. చావు బతుకుల్లో ఉన్న నా కుమారుడిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు. హోం వర్క్ చేయలేదని ఇంత దారుణంగా కొడతాడని నేను ఊహించలేదు. నన్ను కూడా ప్రతిరోజు ఇలానే కొట్టేవాడు. ఆ కారణంగానే మేం విడిపోయాం. ఇప్పుడు నా కొడుకొని ఈ పరిస్థితికి తెచ్చాడు’’ అని బోరుమని విలపించింది.