×
Ad

Yanam Murder : యానాంలో పట్టపగలే దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా యానాంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గోపాల్‌నగర్‌లోని మోకా గార్డెన్స్‌కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తు  తెలియని వ్యక్తి కత్త

  • Published On : March 13, 2022 / 04:51 PM IST

Yanam Murder

Yanam Murder : తూర్పుగోదావరి జిల్లా యానాంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గోపాల్‌నగర్‌లోని మోకా గార్డెన్స్‌కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తు  తెలియని వ్యక్తి కత్తితో పొడిచాడు.

తీవ్ర గాయాల పాలై  రక్తస్రావం అవుతున్న వెంకటేశ్వరరావును   కుటుంబ సభ్యులు  వెంటనే వెంకటేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వెంకటేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వరరావుపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

కాగా .. కాజులూరు మండలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణ స్వామి తమ ఇంటికి వచ్చాడని హతుడి కుమారుడు ఆనంద మూర్తి పోలీసులకు తెలిపాడు. నారాయణ స్వామి వద్ద వెంకటేశ్వర రావు గతంలో అప్పుతీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Cyberabad She Teams : సోషల్ మీడియాపై షీ టీమ్స్ నిఘా-50 మందికి ఫస్ట్ వార్నింగ్
ఆర్ధిక సంబంధమైన లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలిసింది. కాగా వెంకటేశ్వర రావును హత్య చేసిన నిందితుడు నారాయణ స్వామి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.