పెళ్లి వేడుకలో టపాసులు కాలుస్తున్నారా? బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

వివాహానికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటం చూసి ఆందోళన చెందారు.

Fire Incident : పల్నాడు జిల్లా నరసరావుపేటలో పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి ఇంట్లో బాణాసంచా పేలడంతో మండపం, వాహనాలు దగ్దమయ్యాయి. పెళ్లి ఊరేగింపులో టపాసులు కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

నరసరావుపేటలో ఓ వ్యక్తి ఇంట వివాహం సందర్భంగా ఓ ఆటోలో బాణాసంచా ఉంచారు. ఇంటి నుంచి కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపు మొదలవగా టపాసులు పేల్చారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎగిసి టపాసులు ఉన్న ఆటోపై పడ్డాయి. అంతే.. ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఆటోతో పాటు పెళ్లి ఇంటి ముందు వేసిన మండపం సెట్టింగ్, వాహనాలు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.

వేడుకల సందర్భంగా టపాసులు కాల్చడం కామన్. అయితే, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. టపాసులు కాల్చే ప్రాంతానికి, బాణాసంచా నిల్వ ఉంచిన చోటుకి దూరం ఉండేలా చూసుకోవాలి. మనం ఏ చోటులో, ఎలాంటి పరిస్థితుల్లో టపాసులు కాలుస్తున్నామో చూసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం అనేది మర్చిపోకూడదు.

నరసరావుపేటలో పెళ్లి వేడుకలో జరిగింది ఇదే. పటాసులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో నిప్పురవ్వలు బాణాసంచా నిల్వ ఉంచిన ఆటోపై పడటం, అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ప్రమాదంతో పెళ్లింట అలజడి రేగింది. వివాహానికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటం చూసి ఆందోళన చెందారు. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : కారు యాక్సిడెంట్‌లో టీడీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

 

ట్రెండింగ్ వార్తలు