Secunderabad Club : సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం… కోట్లలో ఆస్తి నష్టం

హైదరాబాద్ లోని  జూబ్లీ బస్ స్టేషన్  సమీపంలోని  సికింద్రాబాద్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి.

Secunderabad Club :  హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్  సమీపంలోని  సికింద్రాబాద్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడటంతో క్లబ్ మొత్తం పూర్తిగా తగలబడిపోయింది.
Also Read : TRS MLA Jeevan Reddy : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి‌కి కరోనా పాజిటివ్
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకు  వచ్చారు. సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు అగ్నికీలలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం తెల్లవారుఝామున జరగటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సికింద్రాబాద్ క్లబ్‌లో రూ. 15 లక్షలు కడితేనే మెంబర్షిప్ లభిస్తుంది.  1878లో బ్రిటీష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్  సికింద్రాబాద్ క్లబ్ ను నిర్మించారు.  ఈ తెల్లవారు ఝామున జరిగిన అగ్నిప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా కాలిపోయింది. ఈ భవనంలోనే కిచెన్ తో పాటు క్లబ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు