TRS MLA Jeevan Reddy : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి‌కి కరోనా పాజిటివ్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తేలికపాటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా కోవిడ్ తేలిందని ప్రకటించారు

TRS MLA Jeevan Reddy : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి‌కి కరోనా పాజిటివ్

Armoor Mla Jeevan Reddy

Updated On : January 16, 2022 / 7:55 AM IST

TRS MLA Jeevan Reddy :  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తేలికపాటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా కోవిడ్ తేలిందని ప్రకటించారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయనకు కోవిడ్ సోకటం ఇది రెండవ సారి 2020 జూలై లో ఒకసారి ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.

Also Read :Kurnool : కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం

తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శనివారం కొత్తగా రాష్ట్రంలో 1,963 కేసులు నమోదయ్యాయనిప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. కోవిడ్ వల్ల నిన్న ఇద్దరు మరణించగా… మరో 1,620 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 యాక్టివ్ కేసులు ఉన్నాయి .